Top

చైనాలో శనివారం 99 వైరస్ కేసులు నమోదు

చైనాలో శనివారం 99 వైరస్ కేసులు నమోదు
X

శనివారం చైనాలో 99 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అయితే వీటిలో ఎక్కువగా ఇతర దేశాలనుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

మార్చి మొదటివారం ముగిసే సమయానికల్లా చైనాలో వ్యాప్తి పూర్తిగా అదుపులోనికి వచ్చింది. అయితే గత మూడు రోజులుగా మళ్ళీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ 11న 99 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. అయితే శుక్రవారం నమోదైన 33 కేసులు నమోదైతే.. శనివారం 99 నమోదయ్యాయి.. అయితే ఆదివారం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం 99 కేసుల్లో రెండు మాత్రమే స్థానికంగా నమోదయ్యాయి పేర్కొంది. ఇందులో ఎక్కువగా చైనా వాణిజ్య కేంద్రమైన షాంఘై లో నమోదయ్యాయి. ఏప్రిల్ 11 న నగరంలో 52 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES