అమెరికాకు చేరిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు

కోవిడ్ -19 కు నివారణగా భావించే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా అభ్యర్ధన మేరకు భారతదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఎగుమతి చేసింది. దీంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ శనివారం అమెరికాకు చేరుకుంది, అమెరికా తోపాటు మరికొన్ని దేశాలకు మానవతా దృక్పధంతో ఈ మందును ఎగుమతి చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు భారతదేశం 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను అమెరికాకు ఎగుమతి చేయడంతో పాటు తొమ్మిది మెట్రిక్ టన్నుల పదార్ధం పంపించింది. "కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో మద్దతు ఇస్తున్నాము. భారతదేశం నుండి హైడ్రాక్సీక్లోరోక్విన్ సరుకు ఈ రోజు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకుంది" అని యుఎస్ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story