Top

మనుషులు కాదు మూర్ఖులు.. పోలీస్ చేతినే నరికేశారు

మనుషులు కాదు మూర్ఖులు.. పోలీస్ చేతినే నరికేశారు
X

ప్రజల ఆరోగ్యాన్ని తమ ఆరోగ్యంగా భావించి కుటుంబాలని కూడా కాదని రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ప్రజలందరూ ఇళ్లలో భద్రంగా ఉండేలా చూస్తున్నారు. అలాంటి పోలీస్‌కి చేతులెత్తి నమస్కరించాల్సిన సమయంలో.. ఏఎస్ఐ చేతినే నరికేశాడో దుర్మార్గుడు. పటియాల కూరగాయల మార్కెట్ సమీపంలో 5గురు వ్యక్తులు వాహనం మీద వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. పాస్‌లు చూపించమని పోలీసులు వాళ్లని అడిగారు. కానీ వినకుండా కనీసం సమాధానమైనా చెప్పకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకెళ్లారు. పోలీసులు వారిని వెంబడించడంతో వాహనంలోని వ్యక్తులు పోలీస్‌పై దాడి చేసి ఏఎస్ఐ చేతిని నరికేశారు. మరో అధికారి చేతికి గాయాలయ్యాయి. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఏఎస్ఐని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES