అంతర్జాతీయం

22 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పాజిటివ్ : డబ్ల్యూహెచ్‌వో

22 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా పాజిటివ్ : డబ్ల్యూహెచ్‌వో
X

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ కరోనా బారిన పడి చాల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు సుమారు 22 వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో 22,073 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్‌ పాజిటివ్‌లుగా తేలిందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది. దీంతో ఆరోగ్య కర్యాకర్తలకు తగిన రక్షణ కల్పించాలని, వారికి మాస్కులు, గ్లౌజ్‌లు, గౌన్లు వంటివి సమకూర్చాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో ఆదేశించింది.

Next Story

RELATED STORIES