కరోనా కట్టడిపై సీఎం జగన్ కు విపక్షాల లేఖ

కరోనా కట్టడిపై సీఎం జగన్ కు విపక్షాల లేఖ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పాక్షికంగా ఉపసంహరించాలన్న ఆలోచన మంచిది కాదని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్న కన్నా ఈ సమయంలో వైరస్ ప్రభావిత ప్రాంతాలకే లాక్ డౌన్ ను పరిమితం చెయ్యాలని అనుకోవడం సరైంది కాదన్నారు. కేంద్రం తీసుకున్న సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ప్రసంశించాయని కన్నా గుర్తు చేశారు.

ఏపీలోనూ ఒడిశా మాదిరి ఏప్రిల్ చివరి వరకు లాక్ డౌన్ ను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి లాక్ డౌన్ తో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చించడానికి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చెయ్యాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉందన్న రామకృష్ణ ఏపీలో కరోనా కట్టడికి అన్ని రాజకీయ పక్షాలు సమిష్టిగా కృషి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్డచ్సిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్షమన్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే గ్రీన్ జోన్లలో వ్యవసాయం పనులకు అనుమతించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story