రంజాన్ వేళ.. దయచేసి ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ప్రార్థనలు..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సామాజిక దూరం పాటిస్తే కొంత వరకు వైరస్ వ్యాప్తిని నిరోధించ వచ్చని ఆ దిశగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దాదాపు అన్ని మతాలకు చెందిన వ్యక్తులు తమ తమ కార్యకలాపాలను వాయిదా వేసుకున్నారు. ప్రజల ఆరోగ్యమే అత్యవసరంగా భావించి ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు అన్నీ మూతపడ్డాయి.
ఇక ఈనెల 24నుంచి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్నందున ముస్లింలు సోదరులు మసీద్‌లకు వెళ్లే అవకాశం వుంది. దయచేసి ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి అల్లాను ప్రార్థించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ముస్లిం సోదరులను కోరారు. సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశంతో సహా ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాలు మసీదులు, మత పరమైన ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను నిషేధించాయని నఖ్వీ ANI వార్తా సంస్థకు అందించిన వీడియోలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com