అమెరికాలో ఆదివారం కరోనా మృతులు..

అమెరికాలో ఆదివారం కరోనా మృతులు..

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 22,020. వీటిల్లో దాదాపు 9,385 మరణాలు ఒక్క న్యూయార్క్‌లో సంభవించాయి. దేశం మొత్తంలో నిన్న ఆదివారం ఒక్కరోజే మరణించిన వారి సంఖ్య 1514గా నమోదైంది. మరణించిన వారితో పాటు, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అమెరికాలోనే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం నాటికి 5,59,409 మందికి వైరస్ సోకినట్లు సమాచారం. ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఆదివారం 758 మంది మరణించినట్లు గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు.

వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిందని అదికారులు అంటున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ " అధృశ్య శక్తితో యుద్ధం చేస్తున్నాము. గెలుస్తాము.. గెలిచి తీరుతాము'' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story