లాక్డౌన్‌లో చాలా మంది తిండి లేక చనిపోతారేమో 'మోదీజీ'

లాక్డౌన్‌లో చాలా మంది తిండి లేక చనిపోతారేమో మోదీజీ
X

మే నెల 3 వరకు లాక్డౌన్ పొడిగింపుపై బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ స్పందించారు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్న వాడికి, ఇంట్లో ఫుడ్డున్న వాడికి లాక్డౌన్ బాగానే ఉంటుంది. కానీ పని చేస్తేనే కాని పూట గడవని అభాగ్యులున్న దేశం మనది. వారి పరిస్థితి ఏంటి.. కొంత మంది జీవనాధారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లి వుంటారు. వాళ్లందరూ ఇంటికి వచ్చే దారి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అలాంటి వారందరిని వారి వారి ఇళ్లకు వెళ్లడానికి అనుమతించండి. కరోనా వేళ విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అవి ఎంత వరకు పేదవారికి చేరుతున్నాయి. డబ్బులు లేక తినడానికి తిండి లేక వారు ఎలా జీవిస్తారో మీ ప్రసంగంలో ప్రస్తావించలేదు. తిండి లేక వారంతా చనిపోతారేమో అని కమల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అందర్నీ ఆలోచింపజేస్తున్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

RELATED STORIES