మీ తెలివితేటల్ని కొంచెం మంచి పనులకు వాడండి.. అనుపమ ఫైర్

మీ తెలివితేటల్ని కొంచెం మంచి పనులకు వాడండి.. అనుపమ ఫైర్
X

ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఫేస్ బుక్‌ని హ్యాక్ చేయడం.. ఇలాంటి వన్నీ చదువుకుని కూడా బుద్దిలేని వాళ్లు చేసే పన్లు. ఆ తెలివేదో మంచి పనులకు వాడొచ్చుగా. అయినా మీక్కూడా అమ్మా, అక్కా, చెల్లి ఉండే ఉంటారు కదా. వాళ్లని కూడా ఎవరైనా ఇలా చేస్తే మీకెంత బాధగా ఉంటుంది. మరి మేం కూడా మనుషులమే.. మాక్కూబా బాధ ఉంటుంది కదా. ఎంత సినిమా యాక్టర్లం అయితే మాత్రం ఇష్టం వచ్చినట్లు, రాతలు చేతలు చేస్తామంటే ఎలా ఊరుకుంటారు అని మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ఫైర్ అవుతోంది. ఎవరో తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేశారని వారి పై మండి పడుతోంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే అనుపమను మోడ్రన్ దుస్తుల్లో చూపిస్తూ ఫోటోలు పోస్ట్ చేశారు. తన ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన ఫోటోలను ట్యాగ్ చేస్తూ.. కొంత మంది వెధవలు నా ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసారు. అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇస్తున్నా అంతే అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది ఈ కేరళ కుట్టి.

Next Story

RELATED STORIES