లాక్‌డౌన్ సమర్థిస్తున్నాం. కానీ.. ప్రధాని ప్రసంగంలో కొత్త అంశం ఏముంది: చిదంబరం

లాక్‌డౌన్ సమర్థిస్తున్నాం. కానీ.. ప్రధాని ప్రసంగంలో కొత్త అంశం ఏముంది: చిదంబరం
X

జాతిని ఉద్దేశిస్తూ మోదీ చేసిన ప్రసంగంలో కొత్త అంశం ఏముందని ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని మరోసారి రుజువైందని ట్వీటర్ వేదికగా ఆయన విమర్శించారు.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరో 19 రోజులు లాక్‌డౌన్ పొడిగించడాన్ని తాము సమర్దిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే.. ప్రధాని ప్రసంగంలో లాక్‌డౌన్ పొడిగింపు విషయం మినహా కొత్తదనం ఏముందని ప్రశ్నించారు. పేదల మనుగడకి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులు కోరిన ఆర్థిక సహాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మార్చి 25, 2020న విడుదల చేసిన ప్యాకేజీకి రాష్ట్ర ఖజానాకు జమకాలేదని మండిపడ్డారు. రఘురామ్ రాజన్, జీన్ డ్రేజ్ , ప్రభాత్ పట్నాయక్, అభిజిత్ బెనర్జీ వంటి ఆర్థిక వేత్తల సూచనలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు, ఆహారం రెండూ ఉన్నాయి.. కానీ, ఆ రెండిటిని ప్రభుత్వం మాత్రం విడుదల చేయదంటూ చిదంబరం ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES