భారత్‌ను భయపెడుతున్న కరోనా..

భారత్‌ను భయపెడుతున్న కరోనా..
X

దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది, ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే పరిస్థితి అంచనా వేయడానికే కష్టంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా కొత్తగా మరో వెయ్యి కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఒక్క దిల్లీ, మహరాష్ట్రల్లోనే 700 కేసులు నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇందులో 339 మంది ప్రాణాలు కోల్పోగా, 1036 మంది కోలుకున్నారు మరో 8988 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా వుండగా దేశంలో సగం కరోనా మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. తాజాగా ఆ రాష్ట్ర కోవిడ్ మృతుల సంఖ్య 160కి చేరింది. మరో 349 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందుకే లాక్‌డౌన్ నెలాఖరు వరకు పొడిగించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అవసరమైతే ఈ లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రజల్ని హెచ్చరించారు మఖ్యమంత్రి ముందుగానే. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కోవిడ్ తీవ్ర అధికంగానే ఉంది. ఇక్కడ ఒక్కరోజులోనే 356 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 28మంది మృత్యువాత పడ్డారు.

పాజిటివ్ కేసుల సంఖ్య 1510 అని గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజల రాకపోకలను కట్టుదిట్టం చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా కరోనా వ్యాప్తి అధికంగానే ఉందని అధికార లెక్కల సమాచారం. మధ్యప్రదేశ్‌లో 43 మంది, గుజరాత్‌లో 26 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 17 మరణాలు, ఆంధ్రప్రదేశ్‌లో 7 మరణాలు సంభవించాయి. తెలంగాణలో మంగళవారం ఉదయానికి పాజిటివ్ కేసుల నిర్ధారణ 592 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 493 మందికి ఈ వైరస్ సోకింది.

Next Story

RELATED STORIES