రైతు తలలో తుప్పు పట్టిన కత్తి.. 26 ఏళ్ల తర్వాత తొలగింపు

26 ఏళ్ల తర్వాత ఓ మనిషి తలలో నుంచి 4 అంగుళాల కత్తిని డాక్టర్లు తొలగించారు. చదవటానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ అరుదైన చైనాలో జరిగింది. 26 ఏళ్ల క్రితం ఓ రైతుల తలలో విరిగిపోయిన కత్తిని.. ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో రైతుకి ఉపసమనం లభించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన డౌరిజియో అనే 76 ఏళ్ల రైతుపై 26 ఏళ్ల క్రితం విచక్షణారహితంగా దాడి చేసి కొందరు గాయపరిచారు. ఆ సమయంలో అతని తలలోకి కత్తి దూసుకెళ్లి విరిగిపోయింది. అప్పట్నుంచి సదరు రైతు కత్తిని తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. అయితే 2012 సంవత్సరం నుంచి రైతుకు తీవ్రమైన తలనొప్పి మొదలైంది. ఈ నొప్పి క్రమంగా ఎక్కువ అవుతుండడంతో.. ఇటీవల ఆ రైతు డాక్టర్లును సంప్రదించాడు. డాక్టర్లు అతనికి ఎక్స్‌రే తీయగా.. తలలో తుప్పు పట్టిన 4 అంగుళాల కత్తిని చూసి ఆశ్చర్యపోయారు. మొత్తానికి వైద్యులు రెండు గంటల పాటు సర్జరీ చేసి ఆ కత్తిని తొలగించారు. బాధిత రైతు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్లు తెలిపారు.
RELATED STORIES
K Raghavendra Rao: దర్శకేంద్రుడు రచించిన 'నేను సినిమాకి రాసుకున్న...
17 May 2022 2:02 PM GMTKarate Kalyani: కలెక్టర్‌ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే...
17 May 2022 12:24 PM GMTMahesh Babu: మహేశ్, త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. టైటిల్ రివీల్...
17 May 2022 12:05 PM GMTPrabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTAriyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMTMahesh Babu: ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్...
16 May 2022 4:15 PM GMT