తాజా వార్తలు

మందేసి చిందేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారులు

మందేసి చిందేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారులు
X

ఓ వైపు కరోనా కట్టడికోసం లాక్ డౌన్ కొనసాగుతొంటే.. మరోవైపు ప్రభుత్వాధికారులు మాత్రం రూల్స్ బేఖాతరు చేస్తూ.. మందు, విందు పార్టీల్లో మునిగి తేలుతున్నారు. అది కూడా ఇంట్లో అనుకుంటే పొరపాటే ఏకంగా రెవెన్యూ గెస్ట్ హౌస్ లోనే అధికారులు మందేసి చిందేశారు. ముక్కా, చుక్కతో ఎంజాయ్ చేశారు. విషయం తెలుసుకున్న మీడియా, పోలీసులు సీన్ లోకి రంగప్రవేశం చేయడంతో అధికారులు గోడదూకి ఉరుకులు, పరుగులు పెట్టారు.

ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మందుపార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ వారిలో మధిర తహశీల్ధార్ సైదులు, ఇద్దరు vro లు ఉన్నారు. అలాగే evrd రాజారావు, షబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి, మాటూరిపేట phc డాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. పోలీసుల ఎంట్రీతో వీరంతా అక్కడినుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే డాక్టర్ శ్రీనివాసరావు ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఓ కారు, రెండు బైకులను సీజ్ చేశారు. లాక్ డౌన్ వేళా మద్యం అమ్మకాలపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో వీరికి స్థానిక ఎక్సైజ్ సీఐ మద్యం సప్ప్లై చేయడం చర్చనీయాంశం అయింది.

Next Story

RELATED STORIES