మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది : ప్రధాని మోదీ

మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది : ప్రధాని మోదీ

కరోనా కట్టడికోసం విధించిన లాక్ డౌన్ 'మే' నెల 'మూడో' తేదీవరకు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.. అన్ని ఆలోచించాకే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. లాక్ డౌన్ పై ఏప్రిల్ 20న సమీక్షించి హాట్ స్పాట్ ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని అన్నారు. గతంలో విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మొదట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేత్కర్ జయంతి సందర్బంగా నివాళి అర్పించారు. ప్రపంచ దేశాలతో పోల్చితే మనదేశం కరొనాపై ఎలాంటి పోరాటం చేస్తుందో తెలుసని అన్నారు.

కరోనా సమస్య మరింత పెరగకుండా లాక్ డౌన్ 21 రోజులు లాక్ డౌన్ విధించామని అన్నారు.. కరోనా వ్యాప్తి నిరోదానికి ఆలస్యం చెయ్యకుండా చర్యలు చేపట్టామని అన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలను మూసివేశామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ కు పంపించామని అన్నారు. కరోనా వల్ల జరిగే నష్టాన్ని మనదేశం చాలా వరకు నివారించిందని అన్నారు. కరోనాతో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్న మోదీ.. ప్రజల త్యాగాలతోనే నష్టాన్ని నియంత్రించగలిగామని అన్నారు. చాలామంది అన్నం లేక , ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా నిరయంత్రణ కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారని ఈ సందర్బంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇక కరోనా కట్టడికోసం మే 3 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని మోదీ ప్రకటించేశారు.

Tags

Read MoreRead Less
Next Story