ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే వైరస్ వ్యాప్తి చెందదు : ప్రధాని మోదీ

ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే వైరస్ వ్యాప్తి చెందదు : ప్రధాని మోదీ
X

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మరో మార్గంలేదు. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే వైరస్ వ్యాప్తి చెందదు. ఇప్పుడు అమలులో ఉన్న లాక్ డౌన్ ద్వారా కొంత వరకు కరోనా పాజిటివ్ కేసులను తగ్గించగలిగాం. మరొక్క 20 రోజులు ఈ లాక్ డౌన్ కొనసాగితే ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతాం. నా ఈ నిర్ణయంతో ప్రజలందరూ ఏకీభవిస్తారని, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని నాకు తెలుసు. అయినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భారత్ తీసుకున్న లాక్ డౌన్ స్ఫూర్తిని ప్రపంచ దేశాలన్నీ పాటించడానికి సన్నద్ధమవుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, నోటికి, ముక్కుకు మాస్కులు వాడాలని, సామాజిక దూరం పాటించాలని అంటూ, ప్రధానంగా రోగ నిరోధక శక్తి పెంచుకునే విషయంపై దృష్టి సారించాలని అన్నారు.

Tags

Next Story