మహారాష్ట్రలో 2,455 కి చేరిన పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో 2,455 కి చేరిన పాజిటివ్ కేసులు
X

కరోనా మహమ్మారి వలన భారత్ లోని మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమవుతుంది. సంక్రమణ కేసులు ఇక్కడ నిరంతరం పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 121 కేసులు నమోదయ్యాయి.

దాంతో రాష్ట్రంలో రోగుల సంఖ్య 2455 కి చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 162 కు చేరింది. ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, కొత్తగా నమోదైన 121 కేసులలో 92 ముంబై నుండి నమోదయ్యాయి.. అలాగే 13 నవీ ముంబై నుండి నమోదైతే..

థానే , వాసాయి-విరార్ (పాల్ఘర్ జిల్లాలో) లలో 10 కేసులు, రాయఘడ్ నుండి 5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, ముంబైలోని ధారావిలో మంగళవారం మరో రెండు మరణాలు సంభవించాయి. అలాగే ముంబైలో ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతమైన వర్లి కోలివారా ప్రాంతాన్ని 'కంటైన్‌మెంట్ జోన్'గా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటికి రాకుండా నిషేధించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.

Next Story

RELATED STORIES