మధ్యప్రదేశ్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి..

మధ్యప్రదేశ్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి..

మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోగులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య మొత్తం 731 కి చేరుకుంది. అంతేకాదు మరణించిన వారి సంఖ్య 50 కి చేరుకుంది. ఈ మరణాలలో గరిష్టంగా ఇండోర్ నుండి వుంటే. వీరితో పాటు భోపాల్‌లో నలుగురు, ఉజ్జయినిలో 6, ఖార్గోన్‌లో 3, చింద్వారా, దేవాస్‌ ప్రాంతలలో ఒక్కొక్కరు మరణించారు. మధ్యప్రదేశ్ లో మరణాల సంఖ్య 50 దాటడంతో మహారాష్ట్ర తరువాత మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 160 మంది మరణించారు. ఇందులో కూడా ముంబైలో మాత్రమే 100 మంది ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్ లో కరోనా పరిస్థితిపై ఆరోగ్య కమిషనర్ ఫైజ్ అహ్మద్ కిడ్వాయి మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 1171 నమూనాల నివేదిక ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పారు. ఇందులో 126 కొత్త పాజిటివ్ కేసులు ఉన్నాయని.. ఇందులో ఇండోర్ లో 98, భోపాల్ లో 20, ఉజ్జయిని 1, బార్వానీ 2, జబల్పూర్, షియోపూర్, మాండ్సౌర్ లో ఒక్కొక్క కేసు నమోదైందని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 51 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో 24 జిల్లాల్లో 278 కంటోన్మెంట్ ప్రాంతాలు సృష్టించబడ్డాయి.

ఇదిలావుంటే భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 వేలు దాటింది. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మంగళావారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. దాంతో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.

Tags

Read MoreRead Less
Next Story