అల్లు అర్జున్ లేని అలవైకుంఠపురం..

అల్లు అర్జున్ లేని అలవైకుంఠపురం..

కొన్ని కథలు కొందరి కోసమే సృష్టించబడతాయేమో అన్నట్లుగా ఉంటుంది కథానాయకుల ఎంపిక. అల్లు అర్జున్ లేని అలవైకుంఠపురాన్ని ఊహించుకోవడానికి కొంచెం కష్టం తెలుగు ప్రేక్షకులకి. మరి ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మిస్తే హీరో ఎవరనేది కొంచెం ఆసక్తి కలిగించే అంశం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురం తెలుగు ప్రేక్షకులనే కాదు.. అటు బాలీవుడ్ తారామణులు సైతం బన్నీ స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఇక పాటలైతే చెప్పక్కర్లేదు.. మిలియన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకున్నాయి.

మరి తెలుగులో ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.. శివ కార్తికేయన్‌ని హీరోగా అనుకుంటున్నట్లు కోలీవుడ్ సమాచారం. పూజాహెగ్డే పాత్రకు ఎవరనేది ఇంకా తెలియలేదు. కార్తికేయన్ రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం కోలీవుడ్‌లో కూడా ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

Tags

Read MoreRead Less
Next Story