WHO కు ట్రంప్ భారీ షాక్.. నిధుల నిరాకరణ

WHO కు ట్రంప్ భారీ షాక్.. నిధుల నిరాకరణ

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. 608,377 కేసులు, 25,981 మరణాలతో అమెరికా ఎక్కువగా నష్టపోయిన దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఏమి చేయడం లేదని దీనిపై సంచలన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్. కరోనావైరస్ వ్యాప్తిపై పోరాటం చేయడంలో WHO విఫలమైందని.. దాంతో who కు నిధులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చైనాలో వైరస్ వెలువడిన తరువాత యుఎన్ బాడీ దానిని కప్పిపుచిందని ఆరోపించారు.. దీనికి జవాబుదారీతనం ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.కాగా అమెరికా WHO కు అతిపెద్ద ఫండర్, ప్రతి ఏడాది 400 మిలియన్ డాలర్లను అందిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story