వలస కార్మికులు మరోసారి రోడ్లపైకి వచ్చినా నిరాశే..

వలస కార్మికులు మరోసారి రోడ్లపైకి వచ్చినా నిరాశే..

లాక్డౌన్ ను మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు చెందుతున్న సంగతి తెలిసిందే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లారు కార్మికులు.. అయితే లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో కొంతమంది తమ స్వస్థలాలకు బయలుదేరారు.. ఇలా దారిపట్టిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొంతమంది ఎలాగోలా రైలు పట్టాలు పట్టుకొని, లేదంటే పోలీసులు లేని ప్రాంతాలను చూసుకొని తమ ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే చాలా మంది వలస కార్మికులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అక్కడ తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్నటితో లాక్ డౌన్ ను సడలిస్తారని భావించారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వలస కార్మికులు రోడ్లమీదకు వచ్చారు, కానీ ప్రధాని మాత్రం వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించడంతో వారికి నిరాశ ఎదురైంది.

అయినా కూడా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు మంగళవారం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి రవాణా ఏర్పాట్లు కోరుతూ రోడ్లపైకి వచ్చారు. ముంబైలోని బాంద్రా వెస్ట్ లో పెద్ద సంఘటన జరిగింది, అక్కడ వలస కార్మికులు మందలు మందలుగా రైల్వే స్టేషన్ వెలుపల గుమిగూడాయి, డబ్బు , ఆహార వనరులు లేకపోవడంతో ఇంటికి వెళ్లాలని ఆశించారు. సుమారు 1,000 మంది, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సబర్బన్ బాంద్రా (వెస్ట్) బస్ డిపో వద్ద కూడా భారీగా చేరుకున్నారు. తమను వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అహ్మదాబాద్‌లోని వలస కార్మికుల బృందం కూడా యూపీలోని మహు జిల్లాలోని తమ స్వగ్రామాలకు బయలుదేరింది. అహ్మదాబాద్-గాంధీనగర్ హైవే సమీపంలో వీరిని పోలీసులు గుర్తించారు.. దాంతో వారిని ఆపి ఆహారం, నీరు సమకూర్చారు.

అయితే పోలీసులు ఎంత చెప్పినా వలస కార్మికులు తమ ఇంటికి వెళ్లాలని పట్టుబడుతున్నారు, ఇక్కడ ఆకలితో చనిపోవడం కంటే 13,000 కిలోమీటర్లు నడిచి ఇళ్లకు చేరుకుంటామని చెబుతున్నారు. వీళ్ళే కాదు హైదరాబాద్ నుండి సుమారు 150 మంది వలస కార్మికులు కాలినడకన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలోని పలాసకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే వారిని నగర పరిధిలో పోలీసులు ఆపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకొని వారిని హైదరాబాద్‌లో ఉండమని ఒప్పించారు. ఈ బృందాన్ని సహాయ శిబిరాలకు తరలించడంతోపాటు ఒక్కొక్కరికి రూ .500, 12 కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలాగే దేశవ్యాప్తంగా కార్మికులు స్వస్థలాలకు బయలుదేరడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story