బ్రేకింగ్ : ఐపీఎల్ సీజన్ నిరవధిక వాయిదా

X
TV5 Telugu15 April 2020 4:44 PM GMT
ఐపీఎల్ 2020పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 15కి తొలుత బీసీసీఐ వాయిదా వేసింది. దేశంలో వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సృష్టం చేసింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది.
Indian Premier League 2020 season has now been postponed indefinitely: BCCI Official pic.twitter.com/5kWlfHCh54
— ANI (@ANI) April 15, 2020
Next Story