ఈ నెల 20 నుంచి ఉపాధి హామీ పనులకు అనుమతి

ఈ నెల 20 నుంచి ఉపాధి హామీ పనులకు అనుమతి

ఈ నెల 20 నుంచి పల్లెల్లో ఉపాధి హామీ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త లాక్‌డౌన్ మార్గదర్శకాలలో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం (MGNREGA) కింద పనులను ఏప్రిల్ 20 నుంచి అనుమతించనున్నట్లు హోమ్ శాఖ తెలిపింది. అయితే ఈ పనులు చేసేటప్పుడు ప్రజలు తమ ముఖాలకు మాస్కులు ధరించి.. సామాజిక దూరాన్ని పాటించి పనులు చేసుకోవాలని సూచించింది. నీటిపారుదల , నీటి సంరక్షణకు సంబంధించిన పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా మంది గ్రామీణులకు ఉపాధి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story