లాక్ డౌన్ ఉన్నా.. ఆహార ధాన్యాలకు కొరతలేదు

లాక్ డౌన్ ఉన్నా.. ఆహార ధాన్యాలకు కొరతలేదు
X

కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఆహార ధాన్యాలకు కొరత ఉంటుందేమో అని భయాందోళన చెందుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి బయలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు అధికారులు.. ఒక సంవత్సరం పాటు లాక్డౌన్ ఉన్నా.. పేదలకు సరిపడా ధాన్యం, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు చక్కెర నిల్వలు పరిపుష్టిగా ఉన్నాయి. అంతేకాదు ఈ రబీ సీజన్లో గోధుమ, బంగాళాదుంప-ఉల్లిపాయలు భారీ దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది కేంద్ర వ్యవసాయశాఖ. గోధుమల దిగుబడి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 106.2 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది.

అంటే గత ఏడాది కంటే ఈసారి 4 మిలియన్ టన్నుల గోధుమలు ఎక్కువగా వస్తాయన్నమాట. ఇవి 6.30 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చగలదు. ఇది మాత్రమే కాదు, గోడౌన్లలో ఇప్పటికే గోధుమ , బియ్యం భారీ స్టాక్ ఉంది.. మార్చి 10 నాటికి ఆహార ధాన్యం (గోధుమ మరియు బియ్యం) 58.49 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఇది సాధారణ కాలంలో బఫర్‌గా అవసరమయ్యే దానికంటే చాలా ఎక్కువ. అలాగే, సుమారు 3 మిలియన్ టన్నులు పప్పుధాన్యాలు, 1.1 మిలియన్ టన్నులు నూనెగింజలు మరియు 4 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కొద్దిరోజుల వరకూ ఆహార ధాన్యాలకు కొరత లేదన్నమాట.

Next Story

RELATED STORIES