కరోనా ఎఫెక్ట్.. రెనో కార్ కంపెనీ క్లోజ్

కరోనా ఎఫెక్ట్.. రెనో కార్ కంపెనీ క్లోజ్

కరోనా వైరస్‌కి కారణమైన వూహాన్‌లోనే రెనో కార్ ఫ్యాక్టరీ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా దేశంలో వాహనాల గిరాకీ కూడా బాగానే ఉంటుంది. ఏడేళ్లుగా వ్యాపారం చేస్తూ అత్యధిక లాభాలనే ఆర్జించింది ఈ ఫ్రెంచ్ కార్ల కంపెనీ. కానీ వాహన తయారీలో ఉన్న పోటీ కారణంగా 2017 నుంచి రెనో కార్ విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక ఈ కరోనా ఎఫెక్ట‌తో మరింతగా పడిపోయాయి అమ్మకాలు. ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏకంగా 45.4 శాతానికి పడిపోయి కంపెనీ వర్గాల్లో ఆందోళన కలిగించాయి. వైరస్‌ను నియంత్రించేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉన్నందున డీలర్‌షిప్‌లన్నీ మూతపడ్డాయి. దీంతో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఆ కారణంగా తమ ప్రధాన వ్యాపారాన్ని మూసేస్తున్నామని కార్ల తయారీ సంస్థ రెనో ఎస్‌ఏ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈజీటీ ఎనర్జీ ఆటోమోటివ్ కంపెనీ, నిస్సాన్ మోటార్ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్, వాణిజ్య వాహనాలపై దృష్టి సారిస్తామని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story