ఎనీవే థ్యాంక్స్ టూ కరోనా.. మాకెన్నో నేర్పావు

ఎనీవే థ్యాంక్స్ టూ కరోనా.. మాకెన్నో నేర్పావు

పగలూ రాత్రి పలవరింతలు

కరోనా కలవరింతలు

మాట అదే, పాట అదే

అక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్

అమెరికాలో 60 మృతులు.. ఇంగ్లాండ్‌లో 20 మృతులు

ఒక్కరోజులో లెక్కకు మించిన కేసులు

ఎక్కడ చూసినా మృత్యుఘోషలు

మనుషుల జీవితాలతో మరణమృదంగం వాయిస్తూ

కంటికి కనిపించిన కరోనా కరాళ నృత్యం చేస్తోంది

సౌదీ రాజుకీ వస్తుంది.. పూరిగుడిసెలోని పేదవాడినీ పట్టుకుపోతుంది..

పేదా గొప్పా తారతమ్యాలు తనకేం లేవంటూ కాలరెగరేస్తోంది కరోనా

లాక్డౌన్ వల్ల కొందరి నోటికి ఖాళీ లేదు.. మరి కొందరికి తినడానికి తిండి లేదు

చేతులు శుభ్రం చేసుకుని చెడు వైరస్‌ని కడిగేస్తున్నామనుకుంటున్నాం కానీ

మనసుల్లోని మాలిన్యాలను కూడా కడిగేస్తే మంచిదేమో ఒకసారి ఆలోచించకూడదు

మాస్కులు బాగా పని చేస్తున్నాయ్..

మన ఉఛ్వాస, నిశ్ఛ్వాసలు మనకే తెలుస్తున్నాయ్

ఆవేశంతో మాట్లాడితే ఎక్కువ సార్లు, ఆలోచించి మాట్లాడితే తక్కువ సార్లు

ఊపిరి పీల్చుకోవచ్చని చెప్పకనే చెబుతోంది

అవసరమైతేనే మాట్లాడాలి అంటూ నోరునీ కట్టడి చేస్తోంది

కాస్త దూరం పాటిస్తే మీ బంధాలు కలకాలం నిలుస్తాయనీ చెబుతోంది

ఎన్నాల్టికి పక్కవాడి క్షేమాన్ని కోరుకుంటున్నాం

వాళ్లకి వస్తే మనకీ వస్తుందని తెలియబట్టేగా

అవునుగానీ కరోనా.. ప్రపంచంలోని చెడుని కడిగేయడానికే వచ్చావా

ఏదేమైనా.. మనిషి ఆలోచనా విధానాన్ని మార్చావు

మంచిని పెంచావు.. మానవత్వాన్ని పంచావు

కరోనాకి ముందు.. కరోనాకి తరువాత లాగా

మనిషి మారితే ఎంత సంతోషం..

అత్యాచారాలు, హత్యాచారాలు లేని మరో ప్రపంచం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

Tags

Read MoreRead Less
Next Story