Top

అలాంటి చర్యలకు సమయం ఇది కాదు: ఐక్యరాజ్యసమితి

అలాంటి చర్యలకు సమయం ఇది కాదు: ఐక్యరాజ్యసమితి
X

డబ్ల్యూహెచ్ఓ కు నిధులు నిలిపివేస్తున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇలాంటి ఆపత్కర సమయంలో నిధులు నిలిపివేయడం మంచిది కాదని యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థపైనే కాదు.. కరోనాపై పోరాడుతున్న ఏ సంస్థ పట్ల కూడా ఇటువంటి చర్యలు తీసుకోకూడదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని.. కరోనాపై విజయం సాధించాలని ఆయన సూచించారు. ఈ మహమ్మారి కారణంగా ఉత్పన్నమయ్యే భయంకరమైన పర్యవసానాలను అడ్డుకోవాలని సెక్రెటరీ జనరల్ గుటెరస్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

Next Story

RELATED STORIES