ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఏపీ సీఎం

ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ప్రతి నిర్ణయం న్యాయస్థానాల్లో అబాసుపాలవుతోంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు ఏపీ సీఎం. అతి తక్కువకాలంలో కోర్టులో ఎక్కువసార్లు మొట్టిక్కాయలు తిన్న సీఎం బహుశా జగనే కావచ్చు. పది నెలల కాలంలో ఏకంగా 52 సార్లు కోర్టు మొటిక్కాయలు వేసిందంటే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ఎంత బలహీనంగా ఉంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు crpc కింద నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు సీరియస్ అయింది.

పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వేలకోట్ల ప్రజాధనం వృధా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పేదల భూముల సేకరణ, అసైన్డ్ భూములలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు.. అంతేకాదు అటు రాజధాని భూముల్ని ఇళ్లస్థలాకు ఇవ్వడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక రాజధాని తరలింపుపై ప్రజాగ్రహానికే కాదు న్యాయస్థానం ఆగ్రహానికి గురైంది జగన్ ప్రభుత్వం.. రాజధాని తరలింపుపై దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొట్టిక్కాయలు వేసింది. రాజధాని కార్యాలయాల తరలింపుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గతంలో వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించకపోవడంపై కూడా చివాట్లు పెట్టింది హైకోర్టు. ఇక విజయవాడ దుర్గగుడిలో ఈవో నియామకంను కూడా తప్పుబట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ లోను కోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది.

Tags

Read MoreRead Less
Next Story