బాల్కనీలో బీరు గ్లాసులు.. ఛీర్స్ చెప్పుకుంటూ.. గంటలో 6.9 లక్షల వ్యూస్

బాల్కనీలో బీరు గ్లాసులు.. ఛీర్స్ చెప్పుకుంటూ.. గంటలో 6.9 లక్షల వ్యూస్

కరోనా వైరస్ ఎన్ని రోజులుంటుందో ఏమో కానీ.. బారుకెళ్లి బీరు తాగి ఎన్ని రోజులైంది.. సరే. బాల్కనీలోనే బీరు పార్టీ చేసుకుందామని ఇటలీ వాసులంతా బాల్కనీల్లోకి వచ్చి బీరు గ్లాసులని ఒక పొడవాటి కర్రకి ఉంచి ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లకి ఛీర్స్ చెప్పుకుని మందు పార్టీ చేసుకుంటున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జాబితాలో ఇటలీ మూడో స్థానంలో ఉంది. అందుకే ప్రజలంతా లాక్డౌన్‌తో ఇళ్లలోనే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే వైరల్ అయింది. గంటలో 6.9మిలియన్ల మంది వీక్షించారు. ఇక ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన వారు 295 మంది. కాగా, ప్రపంచం మొత్తంలో కరోనా కేసులు అధికంగా అమెరికాలో నమోదు కాగా రెండో మూడు స్థానాల్లో ఇటలీ, స్పెయిన్ నిలుస్తున్నాయి. అమెరికాలో 26 వేల మృతులు వుంటే, స్పెయిన్‌లో 18,579 మంది ఉండగా, ఇటలీలో తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 21,067 మరణాలు సంభవించాయి.

Tags

Read MoreRead Less
Next Story