Top

కృష్ణా జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే కారు హల్ చల్

కృష్ణా జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే కారు హల్ చల్
X

కృష్ణా జిల్లాలో మాచర్ల ఎమ్మెల్యే కారు హల్ చల్ చేసింది. ఉప్పులూరు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపినా ఆగకుండా వెళ్ళింది. దీంతో కారును వెంబడించి అడ్డుకున్న పోలీసులు దాన్ని కైకలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారులో ఎమ్మెల్యే భార్య ఉన్నారు. ఫంక్షన్ నుంచి కారులో వస్తున్నట్టు తెలుస్తోంది.

విచారణ చేసిన అనంతరం కారును పంపించి వేశారు పోలీసులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డూ అదుపు లేకుండా రోడ్లమీద హల్ చల్ చేస్తున్నారు. నిన్న కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా చిత్తూరు జిల్లా పోలీసులకు విసుగు తెప్పించిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES