Top

ఈ ఏడాది 100% వర్షం కురిసే అవకాశం : ఐఎండీ

ఈ ఏడాది 100% వర్షం కురిసే అవకాశం : ఐఎండీ
X

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షం కురుస్తుందని భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎం.రాజీవన్‌, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ ఎ.మహాపాత్ర ప్రకటించారు. ఈ ఏడాది రుతుపవనాల రాకపై అంచనాలను వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 1 న రుతుపవనాలు కేరళను తాకనున్నాయని. ఈ ఏడాది దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 100 శాతానికి ఐదు శాతం అటు ఇటుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది..

ఇక మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రస్తుత సాధారణ తేదీలతో పోలిస్తే 3 నుంచి 7 రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఎప్పటిలా అక్టోబర్‌ 15న జరుగుతుందని తెలిపారు.

Next Story

RELATED STORIES