అంతర్జాతీయం

సినిమా స్టైల్లో గాల్లోకి ఎగిరిన కారు.. బతికి బట్టకట్టిన డ్రైవర్

సినిమా స్టైల్లో గాల్లోకి ఎగిరిన కారు.. బతికి బట్టకట్టిన డ్రైవర్
X

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో చాల దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు ఖాళీగా ఉంటున్నాయి. రోడ్డు మీదకు రావాలంటే చాలా ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఎవరూ కూడా బయటకు రావడం లేదు. దేశం ఏదైనా ఇప్పుడు పరిస్థితులు ఇలానే ఉంటున్నాయి. కరోనా కారణంగా పోలెండ్ దేశంలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా కొంతమంది వాహనదారులు రెచ్చిపోయి రోడ్లుమీదకు వస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. పైగా ఇది లాక్‌డౌన్ సమయం కావడంతో వారికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఖాళీ రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా పోలాండ్‌లోని లాడ్జ్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. తన సుజికీ స్విఫ్ట్ కారుతో రోడ్డుపైకి వచ్చాడు. వేగంగా కారు నడుపుతూ.. ఎదురుగా ఉన్న రౌండెబౌట్‌(రోడ్డు మధ్యలో ఉండే సర్కిల్)ను ఢీకొట్టాడు. అంతే.. సినిమాల్లో ఫైటింగ్‌, ఛేజింగ్ సీన్ల మాదిరిగా.. స్విఫ్ట్ కారు 60మీట‌ర్ల ఎత్తులో గాల్లోకి ఎగిరింది.

ఈ ఘటన పై సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి వ‌చ్చి కారులో నుంచి డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు తీసి.. హాస్పిటల్‌కి త‌ర‌లించారు. అదృష్టవశాత్తు అందులో ఉన్న డ్రైవ‌ర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌పట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కారు డ్రైవ‌ర్ ఆల్కాహాల్ సేవించి డ్రైవింగ్ చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES