ఆసుపత్రుల నుంచీ అంటుకుంటున్న కరోనా.. 24 మందికి..

ఆసుపత్రుల నుంచీ అంటుకుంటున్న కరోనా.. 24 మందికి..
X

కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నుట్లుంది ఆగ్రా వాసుల పరిస్థితి. పాపం దగ్గు, జ్వరంతో ఆసుపత్రికి వెళ్తే అక్కడ కరోనా వైరస్ సోకడంతో 24 మంది అక్కడే జాయినవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మొత్తం 167 కరోనా కేసులు నమోదు కాగా అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫతేపూర్ సిక్రీకి చెందిన ఓ వ్యక్తి ద్వారా 23 మందికి వైరస్ సంక్రమించింది. వీరంతా అతడి కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారే. ప్రైవేట్ ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు కూడా వైరస్‌ను మోసుకొస్తున్నాయి. నగరంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. నమోదైన 167 కేసుల్లో తబ్లిగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారే 70 మంది వరకు ఉన్నారు. వారి నుంచి ఎంత మందికి అంటుకుని ఉంటుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES