భారత్ ఔషధాలు ఎగుమతి చేస్తే.. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది: ఆర్మీ చీఫ్

భారత్ ఔషధాలు ఎగుమతి చేస్తే.. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది: ఆర్మీ చీఫ్

పాకిస్తాన్ తీరుపై భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే.. పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే పనిలో బిజీగా ఉందని ఆరోపించారు. ఒక్క భారతీయుల గురించి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల బాగోగులు గురించి కూడా ఆలోచించి పలు దేశాలకు.. భారత్ ఔషధాలను ఎగుమతి చేస్తుంటే.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని.. ఇది ఏ మాత్రం కూడా సరైన పద్దతి కాదని మండిపడ్డారు.

జమ్మూ కశ్మీర్‌ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పర్యటించి ఈ విధంగా మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story