సీసీఎంబీ గుడ్‌న్యూస్.. రెండు నెలల్లో కరోనా వైరస్‌కి టీకా.. !!

సీసీఎంబీ గుడ్‌న్యూస్.. రెండు నెలల్లో కరోనా వైరస్‌కి టీకా.. !!

ఎంత మంచి వార్త చెప్పారు. ఏన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్నంత ఆనందంగా ఉంది మన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు చెప్పిన వార్త. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి ధాటికి తట్టుకోలేక కకావికలమవుతున్నాయి. కొందరు శాస్ట్రవేత్తలు కరోనా కట్టడికి పరిశోధనలు చేపట్టారు. సీసీఎంబీ పరిశోధకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా వైరస్ నిర్మూలనకు టీకా తయారు చేస్తున్నట్లు చెప్పారు.

రెండు నెలల్లో ఈ టీకా రూపు సంతరించుకుంటుందని అంటున్నారు. తమ పరిశోధనా విధానాలను వివరించారు.. మొదట ఈ వైరస్‌ను అధికంగా పెంచుతారు. ఆ తరువాత వాటిని వేడి చేయడం ద్వారా వైరస్‌ని నిర్మూలిస్తారు. దాంతో వ్యాధి కారకం అయిన ప్యాథోజెన్ చచ్చిపోతుంది. వైరస్‌లు పెరిగే సామర్థ్యం కూడా నిలిచిపోతుంది. వైరస్‌ను నిర్మూలించే ఈ టీకాను మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందిస్తుంది.

వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే దాడి చేయమని ఆదేశిస్తుంది. దీంతో మన శరీరం రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించుకుని వైరస్‌ను ఎదుర్కుంటాయి. వ్యాధి వ్యాప్తి చేసే వైరస్ చనిపోయినందున మళ్లీ వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టీకా ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చిన తరువాత టీకాల తయారీ పరిశ్రమకు అప్పగిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story