భారత్ లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..

భారత్ లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య ఇదే..
X

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం.. పాజిటివ్ కేసులు 13వేలకు పైగా పెరిగాయి.. అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఊరట కలిగించే విషయం. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 13 వేల 483 కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్రలో మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో వెయ్యి మందికి పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1 వేల 81 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో మహారాష్ట్రలో 286, రాజస్థాన్‌లో 55, ఉత్తర ప్రదేశ్‌లో 70, గుజరాత్‌లో 163, బీహార్‌లో 8 మంది ఉన్నారు. కాగా మొత్తం 13 వేల 483 రోగులలో 11 వేల 201 మంది రోగులు చికిత్స పొందుతున్నారు, 1 వేల 748 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 437 మంది కోవిడ్ భారిన పడి మరణించారు.

Next Story

RELATED STORIES