కరోనా ఎఫెక్ట్.. ముద్దు సన్నివేశాలు ముగిసిపోయినట్లేనా: డైరెక్టర్ డౌట్

కరోనా ఎఫెక్ట్.. ముద్దు సన్నివేశాలు ముగిసిపోయినట్లేనా: డైరెక్టర్ డౌట్

కరోనా వచ్చింది.. కొన్ని నియమాలు జారీ చేసింది.. అందులో ముఖ్యమైంది సామాజిక దూరం పాటించడం.. లాక్‌డౌన్ తరువాత కూడా ప్రజలు అలానే పాటిస్తారా అంటే చెప్పలేని పరిస్థితి.. ఏదేమైనా కొంత కాలమైతే ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు అనేది వాస్తవం. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఎలా బతికి బట్ట కడుతుంది. వద్దంటే ముద్దులు, లెక్కకు మించిన హగ్గులు ప్రతి చిత్రంలో ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టే ప్రయత్నాలు.. మరి ఈ కరోనా వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటోంది కదా.. ఇంక సినిమాలు ఎలా తీయాలి అనేది ఓ డైరక్టర్‌కి వచ్చిన డౌటు.

విక్కీ డోనర్, మదరాస్ కేఫ్, పీకు చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ డైరక్టర్ సూజిత్ సర్కార్‌‌కి వచ్చిన అనుమానం ఇది. హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలను ఎలా చిత్రీకరించాలి. దూరంగానే ఉంచి షూట్ చేసి ఆ తరువాత దగ్గరగా ఉన్నట్లు చూపించాల్సి వస్తుందేమో.. మోసం చేసి అయినా కథలు చెప్పాలి కదా అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన దియా మిర్జా.. సినిమా షూటింగ్ అంటేనే కొన్ని వేల మంది దగ్గరగా ఉండి పని చేయాల్సి వుంటుంది. భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది అని ట్వీట్ చేసింది. మరి కొంత మంది మళ్లీ పాత సినిమాల్లో లాగా ముద్దు సీన్లు వచ్చినప్పుడు రెండు పువ్వులు చూపించడమే అని ట్వీట్లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story