కరోనా కట్టడికి ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం

కరోనా కట్టడికి ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
X

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 30 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ

మొత్తంను ప్రధాన మంత్రి సహాయనిధికి ట్రాన్స్ఫర్ చెయ్యాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే అంతకుముందే ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు మరియు చేతి తొడుగులు వంటి సహాయక సామగ్రిని వివిధ ప్రాంతాలకు పంపించింది. వైద్య అధికారులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) ను కూడా బ్యాంక్ ఇస్తోంది.

కాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో ఈ బ్యాంకుకు 176 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

Next Story

RELATED STORIES