దేవెగౌడ మనమడి వివాహంపై నివేదిక కోరిన ప్రభుత్వం

X
TV5 Telugu17 April 2020 3:12 PM GMT
మాజీ ప్రధాని దేవెగౌడ మనమడు వివాహం అయినా కాసేపటికే ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్లౌతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ అన్నారు. తాము ఇప్పటికే రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడామని.. చర్యలు తప్పవని అశ్వథ్ నారాయణ్ హెచ్చరించారు.
పెళ్లిలో సామాజిక దూరం పాటించలేదని సోషల్ మీడియాలో అనేక వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో యెడ్యూరప్ప సర్కారు రామ్‌నగర్ అధికారుల నుంచి నివేదిక కోరింది.
Next Story