ఏప్రిల్ 17 కొడుకు పెళ్లి.. ఏం పట్టదా కుమార స్వామీ..

ఏప్రిల్ 17 కొడుకు పెళ్లి.. ఏం పట్టదా కుమార స్వామీ..

కుమారా.. కొడుకు పెళ్లికి తొందరేమొచ్చింది నాయనా.. అసలే జనం కరోనాతో ఛస్తుంటే.. దూరం పాటించండి అని ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది మాజీ ముఖ్యమంత్రివి అయి ఉండి ఇదేం పని సామీ అని కర్ణాటక వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న వేళ కుమార స్వామి కుమారుడు (నిఖిల్) పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తెలిసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేవీ పట్టించుకోని స్వామి తన ఏర్పాట్లలో తానున్నారు. రామ్‌నగర్‌లో ఉన్న ఫాం‌మ్‌హౌస్‌లో పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.

బెంగళూరు మొత్తం రెడ్ జోన్‌గా ఉన్నా ఒక్క రాం నగర్ మాత్రం గ్రీన్‌జోన్‌లో ఉండడం కుమారస్వామి అదృష్టం. ఈ ఏరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న ధైర్యం ఆయన్ని కొడుక్కి పెళ్లి చేయనిస్తుంది అని స్థానికులు అంటున్నారు. పెళ్లికి కూడా మొత్తం 60 మంది మాత్రమే హాజరవుతున్నారని, వారంతా కూడా కుటుంబసభ్యులేనని స్వామి తెలిపారు. కుటుంబసభ్యులను సంప్రదించాకే పెళ్లి ఏర్పాట్లు చేశానన్నారు. జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ వివాహ వేడుకకు హాజరు కావొద్దని.. అందరూ ఇళ్లలో ఉండే ఈ జంటను ఆశీర్వదించాలని కోరారు. మే 3 వరకు ఎలాంటి సామాజిక, రాజకీయ కార్యక్రమాలు చేపట్ట వద్దన్న కేంద్ర ఉత్తర్వులను కుమార స్వామి ఉల్లంఘించనట్లు అవుతుందని పలువురు విమర్శిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story