రెండవ ఉద్దీపన ప్యాకేజీ ఎలా ఉండబోతుందో..?

రెండవ ఉద్దీపన ప్యాకేజీ ఎలా ఉండబోతుందో..?
X

కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారికి రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు గురువారం సమావేశమయ్యారు.

లాక్‌డౌన్‌ ప్రభావం ఏఏ రంగాలపై ఏ స్థాయిలో ఉందో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం.. ఈ క్రమంలో రెండోదశలో ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందనే విషయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

రాబోయే ప్యాకేజీ మార్చి చివరలో సీతారామన్ ప్రకటించిన రూ .1.7 ట్రిలియన్ల ప్యాకేజీకి సమానంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్యాకేజీ జిడిపిలో 0.8 శాతం, ఇతర జి 20 దేశాల కన్నా చాలా చిన్నది. డేటా పోర్టల్ స్టాటిస్టా ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ యొక్క ఉద్దీపన ప్యాకేజీ జిడిపిలో 11 శాతం ఉంది.. ఇక ఆస్ట్రేలియా 9.7 శాతం , బ్రెజిల్ 3.5 శాతంగా ఉంది.

అస్సోచం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వంటి సంస్థలు 9 ట్రిలియన్ల నుండి 23 ట్రిలియన్ డాలర్ల వరకు బిగ్-బ్యాంగ్ ప్యాకేజీలను కోరుతున్నాయి.

Next Story

RELATED STORIES