ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించిన పోలీసులు

ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించిన పోలీసులు

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్న వారిపై మహారాష్ట్ర పోలీసులు కొరడా ఝుళిపించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 218 మందిపై సైబర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితమై ఆందోళన చెందుతున్న ప్రజలని మరింత భయానికి గురి చేస్తున్న వారిపై మహారాష్ట్ర పోలీసులు దృష్టి పెట్టారు. టిక్ టాక్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా పెట్టిన పలు తప్పుడు పోస్టులు, వీడియోలను సైబర్ పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు.. తప్పుడు పోస్టులు పెట్టిన వారందరికి.. నోటీసులు జారీ చేయడంతోపాటు వారి పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించమని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story