ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలు

ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలు
X

కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో శుక్రవారం ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లా కీగమ్‌లోని డైరూ వద్ద శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందింది. దాంతో వెంటనే భద్రతా దళాలు వీరు ఉంటున్న స్థావరాలను చుట్టుముట్టాయి.

అనంతరం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు ఒక అధికారి తెలిపారు. అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. మృతదేహాలను ఎన్‌కౌంటర్ స్పాట్ నుంచి వెలికి తీస్తున్నారు అని అధికారి తెలిపారు.ఉగ్రవాదులు హిజ్బుల్ మిజాహిదీన్ దుస్తులు ధరించి ఉండటాన్ని గుర్తించారు. కాగా ఇది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ 44 ఆర్ఆర్ , సిఆర్పిఎఫ్ సంయుక్త ఆపరేషన్.

Next Story

RELATED STORIES