బతకాలని లేదా.. బయటకొస్తున్నారు: సల్మాన్ ఫైర్

బతకాలని లేదా.. బయటకొస్తున్నారు: సల్మాన్ ఫైర్
X

ఎన్ని సార్లు చెప్పాలి బయటకు రావొద్దని.. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర సిబ్బంది ఇంత కష్టపడుతోంది కరోనాను కట్టడి చేసేందుకు. అయినా కొంచెం కూడా వినిపించుకోకుండా బయటకు వస్తున్నారు.. చావడానికి వెళ్తున్నారా లేక బతకడానికి వెళ్తున్నారా అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్న వారిని ' దేశ జనాభాను తగ్గించాలనుకుంటున్నారా.. ఆ పని మీ కుటుంబంతోనే మొదలు పెట్టాలనుకుంటున్నారా అని ఫైర్ అవుతున్నారు.

తమ ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వారిపై రాళ్లు విసరడం ఎంతటి అమానవీయ చర్యో ఆలోచించారా అని అడుగుతున్నారు. ప్రార్థనలు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అని అన్నారు. బయటకు వస్తే మీతో పాటు మీ కుటుంబసభ్యులకు కూడా ప్రమాదమే కదా. ఆ విషయాన్ని ఎందుకు మర్చి పోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సల్మాన్

Next Story

RELATED STORIES