ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు గత 24 గంటల్లోనే వేలాది పాజిటివ్ కేసులు నమోదైనట్టు నివేదికలు అందుతున్నాయి. అన్ని దేశాల్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,182,058 కు చేరింది. ఇందులో మొత్తం లక్షా 45 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక 5.5 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,483,991 యాక్టీవ్ కేసులు ఉండగా. ఇందులో అత్యధికంగా అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో అయితే ఏకంగా 6.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 29 వేల కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో మొత్తం 35 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక యూకేలో గురువారం ఒక్కరోజే 861 మంది మరణించారు.. అలాగే ఫ్రాన్స్‌లో 753 మంది, ఇటలీలో 525 మంది, స్పెయిన్‌లో 503 మంది, బెల్జియంలో 417 మంది, జర్మనీలో 248 మంది, బ్రెజిల్‌లో 190 మంది, కెనడాలో 181 మంది నెదర్లాండ్స్‌లో 181 మంది, స్వీడన్‌ లో 130 మంది, టర్కీలో 125 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story