కరోనా కాటుకు 3 లక్షల మంది.. కట్టడి చేయకపోతే 33 లక్షల మంది: ఐరాస

కరోనా కాటుకు 3 లక్షల మంది.. కట్టడి చేయకపోతే 33 లక్షల మంది: ఐరాస

పేదరికం, రద్దీగా ఉండే పట్టణాలు, ఆరోగ్య సమస్యలు, అధునాతన వైద్య సౌకర్యాలు లేకపోవడం ఆఫ్రికాలో మరింత మంది కరోనా వైరస్ బారిన పడేలా చేస్తున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే అక్కడ ఈ ఏడాది కనీసం మూడు లక్షల మంది మరణిస్తారని ఇంపీరియల్ కాలేజ్ లండన్ మోడల్ తన నివేదికలో వెలువరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య 33 లక్షలకు చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 21 లక్షలు నమోదు కాగా మృతి చెందిన వారు 1.47లక్షల మంది ఉన్నారు. ఆఫ్రికాలో శుక్రవారానికి 18 వేల కేసులు నమోదయ్యాయి. ఐరోపా తరహాలో ఇక్కడ వైరస్ వ్యాప్తి విజృంభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత దూరం పాటించినప్పటికీ 12.2 కోట్ల మందికి వైరస్ సోకుతుందని ఐరాస అభిప్రాయపడుతోంది. అధునాతన వైద్య సదుపాయాలు లేని ఆఫ్రికాలో వైరస్‌ను ఎదుర్కోవడం కష్టం సాధ్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story