మరో విలువైన భవంతిని కొనుగోలు చేసిన అమెజాన్ వ్యవస్థాపకుడు

మరో విలువైన భవంతిని కొనుగోలు చేసిన అమెజాన్ వ్యవస్థాపకుడు

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ న్యూయార్క్‌లో 16 మిలియన్లు విలువైన భవంతిని కొనుగోలు చేశారు. మొత్తం 3,000 చదరపు అడుగుల సామర్ధ్యం కలిగిన ఈ అపార్టుమెంటు.. ఆయన ఇంతకుముందే కొనుగోలు చేసిన 80 మిలియన్ డాలర్ల విలువైన కాండోస్‌ ఇంటికి ప్రక్కనే ఉంది. కొత్తగా కొన్న అపార్ట్‌మెంట్‌లో మూడు బెడ్‌రూమ్‌లు, మూడు స్నానాల గదులు ఉన్నాయి.

గత వేసవిలో, బెజోస్.. మాడిసన్ స్క్వేర్ పార్కులో పునర్నిర్మించిన నియో-గోతిక్ భవనంలో కొత్త ఇల్లు క్రింద ఒక పెంట్ హౌస్ , రెండు అపార్టుమెంటులను కొనుగోలు చేశాడు. ఇక తాజాగా ఈ కొత్త ఇంటిలో మునుపటి వివరాల ప్రకారం, భారీ కిటికీలు, హై లెవల్ కాఫెర్డ్ పైకప్పులు, పాలరాయి గోడలు , కౌంటర్‌టాప్‌లు ఉన్నాయని మాన్షన్ గ్లోబల్ నివేదించింది.

Tags

Read MoreRead Less
Next Story