కొరియా నుంచి కోవిడ్ కిట్లు.. 10 నిమిషాల్లో రిజల్ట్..

కొరియా నుంచి కోవిడ్ కిట్లు.. 10 నిమిషాల్లో రిజల్ట్..

కరోనా మహమ్మారిని వీలైనంత త్వరగా తరిమేయాలి. మన చేతులో ఉన్న ఒకే ఒక ఆయుధం.. కేసులను త్వరితగతిన గుర్తించి మరింత మందికి వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం. అందుకు అత్యాధునిక వైద్య సదుపాయాన్ని ఉపయోగించ దలచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శుక్రవారం ప్రత్యేక చార్టర్డ్ ప్లైట్ ద్వారా దక్షిణ కొరియా నుంచి లక్ష కోవిడ్ కిట్లను దిగుమతి చేసుకుంది. ఈ కిట్ ద్వారా వ్యక్తికి కరోనా సోకిందీ లేనిది పది నిమిషాల్లో తెలిసిపోతుంది. మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని జిల్లాలన్నింటికి ఈ కిట్లను బదిలీ చేస్తామని అధికారులు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కొత్త పాజిటివ్ కేసులు వెలు చూసాయి. ఏపీ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 572 కు చేరింది. చికిత్ప పొంది 35 మంది డిశ్చార్జి అయితే 14 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల మందికి కరోనా పరీక్షలు అవసరమని వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కిట్ల ద్వారా కరోనా పరీక్షలు వేగవంతం చేయడానికి వైద్యులు సన్నద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story