త్వరలో మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ

త్వరలో మధ్యప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే వారం కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. మార్చి 23 న రాజ్‌భవన్‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా సంక్షోభం దృష్ట్యా ఆయన ఒక్కరే ఒంటరిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహమ్మారి కట్టడికి పోరాటం చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, నాలుగు రోజుల క్రితం విలేకరుల సమావేశం నిర్వహించి, ఆ సందర్భంగా దేశంలో ఇటువంటి సంక్షోభంలో ఆరోగ్య శాఖ మంత్రి , హోంమంత్రి లేని ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్ అని విమర్శలు చేశారు.

ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని కాదుకానీ కరోనా కట్టడికి సహచరులు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలోనే కేబినెట్ ఏర్పాటు గురించి చాలా చర్చలు జరిగాయి, కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి అంతర్గత స్థాయిలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిరంతరం చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా అభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. సింధియా గురువారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి తన వర్గం వారికి పదవుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story