భారత్ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. తాజాగా..

భారత్ లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు.. తాజాగా..

భారత్ లో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ ఆగడం లేదు.. రోజురోజుకు పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం,మొత్తం కేసుల సంఖ్య 13,885 కు చేరుకుంది. అయితే ఇందులో కోలుకున్నవారు 1,766 మంది ఉండగా.. 452 మంది మరణించారు. దాంతో మొత్తం 11,616 క్రియాశీల కేసులు ఉన్నాయి.. అయితే ఇందులో 76 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు. శుక్రవారం 23 కి పైగా కోవిడ్ భారిన పడి మరణించారు. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధికంగా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర 3,320 వున్నాయి..

ఆ తరువాత ఢిల్లీ 1,640, తమిళనాడు 1,267. మధ్యప్రదేశ్‌లో కోవిడ్ -19 కేసులు 1,308 కు, రాజస్థాన్‌లో 1,131, గుజరాత్‌లో 1,021, ఉత్తర ప్రదేశ్‌లో 846 , తెలంగాణలో 743, ఆంధ్రప్రదేశ్ 572, కేరళ 395 , కర్ణాటకలో 353, జమ్మూ కాశ్మీర్‌లో 314, పశ్చిమ బెంగాల్‌లో 255, హర్యానాలో 205, పంజాబ్‌లో 186 , బీహార్‌లో 83 , ఒడిశాలో 60 , ఉత్తరాఖండ్‌లో 37, ఛత్తీస్‌గడ్ లో 36 , హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో 35 , జార్ఖండ్‌లో 29, చండీగర్ 21 , లడఖ్‌ లో 18 , అండమాన్, నికోబార్ దీవుల నుంచి 11 , మేఘాలయలో 9, గోవా మరియు పుదుచ్చేరిలో 7, మణిపూర్ మరియు త్రిపురాలలో 2, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్క కేసు నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story