బెయిల్ కావాలా నాయనా.. అయితే.. పీఎం-కేర్స్‌కు విరాళం ఇవ్వమ్మా..

బెయిల్ కావాలా నాయనా.. అయితే.. పీఎం-కేర్స్‌కు విరాళం ఇవ్వమ్మా..

పీఎం-కేర్స్‌కు విరాళం ఇస్తే.. బెయిల్‌ ఇస్తా అని న్యాయమూర్తి షరతు విధించైనా ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. దీంతో బీజేపీ మాజీ ఎంపీతో పాటు మరో ఐదుగురు పీఎం-కేర్స్‌కు రూ.35వేల విరాళం ఇచ్చి బెయిల్‌ పొందారు.

2012లో నిర్వహించిన రైల్‌ రోకో కేసులో బీజేపీ మాజీ ఎంపీ సోమ్‌ మరండీ సహా మరో ఐదుగురు దోషులుగా తేలారు. దీనిపై విచారణ చేపట్టిన సహిబ్‌గంజ్‌ రైల్వే జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌.. వారికి ఒక ఏడాది పాటు సాధారణ జైలు జీవితం గడపాలని శిక్ష ఖరారు చేశారు. దీంతో ఫిబ్రవరి నుంచి వారు జైలు జీవితం గడుపుతున్నారు.

అయితే తాజాగా.. ఈ శిక్షను కొట్టివేయాలని దోషులు ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపే అవకాశం లేదని న్యాయస్థానం తెలపటంతో.. కనీసం బెయిలైనా ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అనుభా రావత్‌ చౌదరి.. పీఎం-కేర్స్‌కు రూ.35,000 విరాళం సహా, ఆరోగ్య-సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే బెయిల్‌ ఇస్తామని షరతు విధించారు. దీంతో వారు ఆ షరతులకు అంగీకరించి బెయిల్ పొందారు.

Tags

Read MoreRead Less
Next Story